
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో చిన్నారులను కిడ్నాప్ చేసి మార్కెట్‌లో అమ్ముతున్న ముఠా గట్టును పోలీసులు రట్టు చేశారు. నలుగురు సభ్యులు గల ముఠాను అదుపులోకి తీసుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు ముగ్గురు చిన్నారులను రక్షించారు. పిల్లల్ని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. వారం రోజుల కిందట చీరల వ్యాపారి ఫజల్ తన కొడుకు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన స్పెషల్ టీమ్ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టింది. ఈ ఘటనతో సంబంధం ఉన్న నలుగురు మహిళలను పోలీసులు అదులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ముగ్గురు చిన్నారులకు విముక్తి కల్పించారు. ఇంటి ముందు ఒంటరిగా ఆడుకుంటున్న చిన్నారులను కిడ్నాప్ చేసి.. పిల్లలు లేని వారికి విక్రయిస్తున్నారు. ఇందుకోసం రూ. 10వేల నుంచి రూ.30 వేల వరకు తీసుకుంటున్నారు. అయితే నిందుతులు ఇంకా ఎవరైనా చిన్నారులను కిడ్నాప్ చేసిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.