చంద్రగ్రహణం.. నరబలికి యత్నం.. | Police Arrest 7 Members While Trying Witchcraft In Nuzivid | Sakshi
Sakshi News home page

చంద్రగ్రహణం.. నరబలికి యత్నం..

Jul 27 2018 8:16 PM | Updated on Jul 28 2018 9:59 AM

Police Arrest 7 Members While Trying Witchcraft In Nuzivid - Sakshi

సాక్షి, నూజివీడు (కృష్ణా జిల్లా) : నూజివీడు మండలం యలమందలో శుక్రవారం క్షుద్రపూజలు కలకలం రేపాయి. 100 ఏళ్లకు ఒక్కసారి వచ్చే అరుదైన అతి సుదీర్ఘమైన చంద్రగ్రహణం నాడు నరబలి ఇస్తే అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయనే మూఢ నమ్మకం ఉంది. దీంతో యనమదలకు చెందిన ఏడుగురు వ్యక్తులు క్షుద్రపూజలు చేయాలని నిశ్చయించుకున్నారు.

అనుకున్నదే తడవుగా ఓ ప్రాంతంలో ఇందుకు తగిన ఏర్పాటు పూర్తి చేశారు. నరబలి అనంతరం మృతదేహాన్ని పూడ్చేందుకు గొయ్యిని సైతం తవ్వించాడు. చిన్నం ప్రవీణ్‌ అనే వ్యక్తిని బలి ఇవ్వడానికి అన్నీ సిద్ధం చేసుకోగా, విషయం తెలుసుకున్న అతడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఏడుగురి అరెస్టు చేశారు. క్షుద్రపూజలపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement