వడ్డీకి తీసుకున్న వ్యక్తే హతమార్చాడు

The person who took the interest was killed - Sakshi

తూర్పుగోదావరి : పెద్దాపురం మండలం గుడివాడకు చెందిన ఫైనాన్సియర్  పోతంశెట్టి విష్ణుఈశ్వర్లు(50) అదృశ్యం కేసును  పోలీసులు చేధించారు. గోకవరం మండలం తిరుమలాయపాలెంలో వడ్డీకి డబ్బులు తీసుకున్న వ్యక్తే హత్య చేశాడని తేల్చారు. వివరాలు..గుడివాడకు చెందిన విష్ణుఈశ్వర్లు వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. తిరుమలాయపాలెం గ్రామానికి చెందిన షేక్‌షావలీ​కి సుమారు రూ.50 వేలు వడ్డీకి ఇచ్చినట్లు తెలిసింది. మంగళవారం విష్ణుఈశ్వర్లు, షేక్‌షావలీకి ఇచ్చిన డబ్బులు వసూలు చేసేందుకు తిరుమలాయపాలెంనకు వెళ్లాడు. అప్పటి నుంచి విష్ణు జాడ తెలియలేదు.

 విష్ణు కుటుంబ సభ్యులు శుక్రవారం షేక్‌షావలీ ఇంటి వద్దకు వచ్చి విచారిస్తుండగా వారికి కుళ్లిన వాసన రావడంతో వారికి అనుమానం మొదలైంది. లెట్రిన్‌ కోసం తవ్విన బావిలో వాసన రావడంతో పరిశీలించారు. అందులో తవ్విచూడగా విష్ణు శవమై కనిపించాడు. దీంతో విష్ణు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి షేక్‌షావలీని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top