అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య | person suicide with debts worry | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

Jan 17 2018 6:36 PM | Updated on Jan 17 2018 6:36 PM

హసన్‌పర్తి: చేసిన అప్పులు తీర్చలేనని ఆందోళనకు గురైన ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా హసన్‌పర్తి మండలం బైరాన్‌పల్లిలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి  చెందిన బైరి గణేష్‌రెడ్డి(40) కుటుంబ పోషణతోపాటు వ్యాపారం నిమిత్తం వివిధ వర్గాల నుంచి అప్పులు చేశాడు. అయితే సుమారు రూ.10 లక్షలు అప్పులు చేయగా వాటిని తీర్చలేనని మనోవేదనకు గురైన గణేష్‌ ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య రేణుక, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుధాకర్‌ తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement