80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌: కొప్పుల

Telangana: Notification For 80 Thousand Jobs: Koppula Eshwar - Sakshi

హసన్‌పర్తి: రాష్ట్రవ్యాప్తంగా త్వరలో 80 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖమంత్రి కొప్పుల ఈశ్వర్‌ వెల్లడించారు. ఆదివారం హనుమకొండ జిల్లా కేంద్రంలో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దివ్యాంగుల రోస్టర్‌ విధానంలో మార్పు చేసి బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు.

త్వరలో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో లూయిస్‌ బ్రెయిలీ విగ్రహాల ఏర్పాటుకు చర్య­లు తీసుకుంటామన్నారు. అనంతరం మంత్రిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్, రాష్ట్ర దివ్యాంగుల సంస్థల చైర్మన్‌ కేతిరి వాసుదే­వరెడ్డి, కుడా చైర్మన్‌ సుందర్‌రాజ్, జెడ్పీ చైర్మన్‌ సుధీర్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top