వ్యక్తి అస్తిపంజరం లభ్యం | Person Skeleton Find out In Warangal | Sakshi
Sakshi News home page

వ్యక్తి అస్తిపంజరం లభ్యం

Jul 2 2019 10:16 AM | Updated on Jul 2 2019 10:17 AM

Person Skeleton Find out In Warangal  - Sakshi

సాక్షి, టేకుమట్ల(వరంగల్‌) : గుర్తు తెలియని వ్యక్తి ఆస్తిపంజరం రాఘవరెడ్డిపేట శివారులో సోమవారం లభ్యమైందని ఇన్‌చార్జి ఎస్సై అనిల్‌కుమార్‌ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం..  మండలంలోని రాఘవరెడ్డిపేట శివారులో రోడ్డు పక్కన్న సంచిలో మూటగట్టిన అస్తిపంజరం సోమవారం వెలుగులోకి వచ్చింది. రోడ్డు పక్కన ఉన్న సంచి వర్షానికి తడవడంతో దాన్ని కుక్కలు పికాయి. దీంతో సంచిలోంచి పుర్రె,, చెప్పులు, కాలిబొక్కలు బయటకు వచ్చాయి. అటుగా వెళ్లిన రైతులు చూసి పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో భూపాలపల్లి డీఎస్పీ కిరణ్‌కుమార్, సీఐ శ్రీనివాస్, ఎస్సై అనిల్‌కుమార్‌ సంఘటనా స్థలానికి చేరుకోని విచారణ చేపట్టారు. మృతుడికి స్వెటర్‌ ఉండటంతో డిసెంబర్, జనవరిలో ఎవరో చంపి సంచిలో మూటగట్టి ఇక్కడ పడేసినట్లుగా పోలీసులు అంచనా వేస్తున్నారు. మృతదేహం కుళ్లిపోయి వాసన రాకుండా ఉండేందుకు హంతకులు పాలిథిన్‌ సంచుల్లో కట్టి యూరియా సంచిలో పెట్టి రోడ్డు పక్కన పడేశారు. అయితే 5, 6 నెలల క్రితం సంచి ఇక్కడ లేదని ఎండాకాలంలో ఈ  ప్రాంతంలో చెత్తను కాలపెట్టినప్పుడు సంచి కూడా కాలి ఉండేదని గ్రామస్తులు చెబుతున్నారు.  

పరకాలకు చెందిన వ్యక్తిగా..
రాఘవరెడ్డిపేటలో అస్తి పంజరం లభించడంతో పోలీసులు అన్ని పోలీస్‌స్టేషన్‌లకు సమాచారం అందించడంతో పరకాల రాజుపేటకు చెందిన తుమ్మల శ్రీకాంత్‌ (18) 5 నెలల నుంచి కనపడటం లేదని ఫిర్యాదు వచ్చిందని పరకాల సీఐ మధు సంఘటన స్థలానికి వచ్చారు. శ్రీకాంత్‌కు సంబంధించిన బంధువులకు, తల్లిదండ్రులకు సమాచారం అందించగా రాత్రి అయినందున అందుబాటులో ఎవరూ లేరని సంఘటన స్థలానికి రాలేదు. శ్రీకాంత్‌కు తెలిసిన మిత్రులు ఫొటో తీసుకుని రాగా శ్రీకాంత్‌ ఫొటోలోని  చెప్పులు, చేతిదండ, పాయింట్‌ ఒకే రకంగా ఉన్నాయి. కాని శ్రీకాంత్‌ సంబంధీకులు ఎవరూ రాకపోవడంతో అస్తి పంజరాన్ని, స్వెటర్, చెప్పులను ప్యాక్‌ చేసి ఎంజీఎం మార్చురీకి  తరలించారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement