రూ.100 కోసం..రూ.77 వేలు

Patna man seeks Rs100 refund from Zomato, loses Rs 77000 in dubious transactions  - Sakshi

సైబర్ మోసం , జొమాటో రిఫండ్‌ కోసం ప్రయత్నిస్తే.. రూ. 77 వేలు మాయం

సాక్షి, పట్నా: బిహార్ రాజధాని పట్నాలో ఈ విచిత్రమైన సంఘటన జరిగింది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. రెప్పపాటులో సొమ్మును పోగొట్టుకోవడం ఖాయం. గుర్తు తెలియని వ్యక్తులు పంపించే అనుమానాస్పద లింక్‌లపై క్లిక్‌ చేసి బ్యాంక్‌ లావాదేవీలు చేస్తే...సైబర్‌ నేరగాళ్ల బారిన పడక తప్పదు.  పట్నాలోని ఒక ఇంజనీర్‌కు ఇలాంటి చేదు అనుభవమే ఎదునైంది.  వంద రూపాయల రిఫండ్‌ కోసం ప్రయత్నించిన వ్యక్తి ఖాతానే ఖాళీ చేసిన వైనం ఒకటి చోటు చేసుకుంది.  దీంతో  కోల్పోయిన తన  సొమ్ముకోసం బ్యాంకులు,  పోలీసుల చుట్టూ తిరుగుతున్నాడు బాధితుడు

వివరాలు ఇలా వున్నాయి...సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అయిన విష్ణు ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో ద్వారా ఫుడ​ ఆర్డర్ చేశాడు. డెలివరీ బాయ్ తీసుకొచ్చిన ఆహార నాణ్యతపై సంతృప్తి చెందక దాన్ని తిరిగి పంపించేశాడు. ఇందుకు డబ్బులు వాపస్‌ ఇవ్వాలని కోరగా..జొమాటో కస్టమర్ కేర్‌ను సంప‍్రదించమని. అందులోని మొదటి నంబరుకు ఫోన్‌ చేయమని డెలివరీ బాయ్‌ సలహా ఇచ్చాడు.  దీంతో విష్ణు గూగుల్ సెర్చ్‌లోని  "జొమాటో కస్టమర్ కేర్"  అని వున్న నంబరుకు ఫోన్‌ చేశాడు. వెంటనే జోమాటో కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌ నంటూ ఒక వ్యక్తం కాల్‌  చేశాడు.  రూ.100  రిఫండ్‌ చేయాలంటే  10 అదనంగా డిపాజిట్‌ చేయాల్సి వుంటుందంటూ ఒక లింక్‌ను పంపాడు.  ఏ మాత్రం ఆలోచించని ఇంజనీర్ వెంటనే లింక్‌పై క్లిక్ చేసి రూ.10 డిపాజిట్ చేశాడు. అంతే  ఈ లావాదేవీ జరిగిన కొద్ది నిమిషాల్లోనే విష్ణు బ్యాంక్ ఖాతాలోంచి  సొమ్ము మొత్తం గల్లంతైంది. చూస్తూండగానే  బహుళ లావాదేవీల ద్వారా  77 వేల రూపాయల మొత్తాన్ని అవతలి వ్యక్తి  మాయంచేస్తోంటే.. విష్ణు అచేతనంగా మిగిలిపోయాడు.  ఈ సంఘటన సెప్టెంబర్ 10 జరిగింది. దీంతో లబోదిబోమంటూ విష్ణు తన సొమ్మును వెనక్కి తెచ్చుకునే పనిలో పడ్డాడు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top