వోల్వో బస్సు- ఆటో ఢీ.. ఒకరు మృతి

సాక్షి, విజయనగరం : జిల్లాలోని దత్తిరాజేరు మండలం మరడాం సమీపంలో గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలివి.. వేగంగా ప్రయాణిస్తున్న వోల్వో బస్సు, ఆటో ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతిచెందిన వ్యక్తి మరడాం గ్రామానికి చెందిన షేక్‌ అబ్దుల్లాగా(19) స్థానికులు గుర్తించారు. క్షతగ్రాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top