
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి,హైదరాబాద్ : స్నేహితుడి మరణాన్ని జీర్ణించుకోలేక ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అంబర్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ రమేష్ కథనం ప్రకారం...గోల్నాక న్యూ గంగానగర్‌కు చెందిన ఆశయ్య(85) అదే ప్రాంతానికి చెందిన వహీద్‌తో కలిసి సివిల్ కాంట్రాక్ పనులు చేసేవాడు.
ఇద్దరు ప్రాణస్నేహితులు. నిత్యం గల్లీలో ఒకే చోటు కుర్చుని కబుర్లు చెప్పుకునేవారు. 15 రోజుల క్రితం వహీద్ ఆనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి ఆశయ్య మనోవేదనకు లోనయ్యాడు.
ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.