
సాక్షి, హైదరాబాద్: చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై విచారణ చేపట్టిన జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఆదివారం దిశ తల్లిదండ్రులను విచారించింది. తెలంగాణ పోలీస్ అకాడమీలో మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ముందు దిశ కుటుంబసభ్యులు హాజరయ్యారు. దిశ తండ్రి, సోదరి స్టేట్‌మెంట్‌లను ఎన్‌హెచ్ఆర్‌సీ బృందం రికార్డు చేసింది. ఘటన రోజు ఏం జరిగిందో దిశ కుటుంబ సభ్యుల వివరాలను ఎన్‌హెచ్ఆర్‌సీ బృందం తెలుసుకుంది.
నిందితులు ఎన్‌కౌంటర్ అయ్యారనే విషయం మీడియాలో వచ్చేవరకు తమకు తెలియదని దిశ కుటుంబసభ్యులు తెలిపారు. దిశ సంఘటనపై న్యాయం చేస్తామని కుటుంబసభ్యులకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ బృందం హామీ ఇచ్చింది.