
స్వర్ణకారులకు అందించిన త్రాచు
ముస్తాబాద్(సిరిసిల్ల): బంగారు ఆభరణాల తూకాల్లో మో సాలను అరికట్టేందు కు తూనికల, కొలతల శాఖాధికారులు కొత్త త్రాసులు ప్రవే శపెట్టారు. ఎలక్ట్రాని క్ మిషన్లను వినియోగించవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ముస్తాబాద్ మండలంలో ఉన్న 40 జ్యువెలరీ దుకాణాదారులకు నోటీసులు జారీ చేశారు.
కాగా 13 మంది స్వర్ణకారులు కొత్త మిషన్లను కొనుగోలు చేశారు. మిగితా వారు ఇంకా చేయలేదు. మిల్లీ గ్రాము నుంచి కిలో వరకు బంగారు, వెండి ఆభరణాలను తూచేందుకు కొత్త త్రాచులు ఉపయోగపడుతాయి. ఈ మేరకు ముస్తాబాద్‌లో 13 మంది స్వర్ణకారులకు గురువారం కొత్త కాంటా, తక్కళ్లను పంపిణీ చేశారు.