శ్యామ్‌ కే నాయుడు కేసులో కొత్త ట్విస్ట్‌ | New Twist In Shyam K Naidu And Sai Sudha Case | Sakshi
Sakshi News home page

నకిలీ పత్రాలతో బెయిల్‌ పొందిన శ్యామ్‌

Jun 29 2020 8:11 PM | Updated on Jun 29 2020 8:20 PM

New Twist In Shyam K Naidu And Sai Sudha Case  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడు తమ్ముడు శ్యామ్‌ కే నాయుడు కేసులో కొత్త ట్విస్ట్‌ నెలకొంది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో నటి సాయి సుధ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్యామ్‌కేనాయుడుని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం రిమాండ్‌కు తరలించారు. అయితే రిమాండ్‌కు వెళ్లిన రెండు రోజుల్లోనే అతడు బెయిల్‌పై బయటకు వచ్చాడు. (శ్యామ్‌ కే నాయుడిపై మోసం కేసు)

బాధితురాలు సాయి సుధతో తను రాజీ కుదుర్చుకున్నట్లు నాంపల్లి కోర్టులో శ్యామ్‌ బెయిల్‌ ఫిటిషన్‌ దాఖలు చేశాడు. దీంతో అతడికి న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది.  అయితే శ్యామ్‌కు న్యాయస్థానం బెయిల్‌ ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ సాయి సుధ కోర్టును ఆశ్రయించింది. దొంగ సంతకం పెట్టి బెయిల్‌కు తాను ఒప్పకున్నట్లు ఓ నకిలీ పత్రాన్ని సృష్టించాడని న్యాయస్థానానికి బాధితురాలు తెలిపింది. విచారణ చేపట్టిన న్యాయస్థానం శ్యామ్ ‌కే నాయుడు బెయిల్‌ను రద్దు చేసింది. దీంతో అతడు మరింత చిక్కుల్లో పడ్డాడు. 

Advertisement
 
Advertisement
Advertisement