మెక్సికోలో కాల్పులు: ముగ్గురు మృతి!

New Mexico high school shooting leaves three students dead - Sakshi

మెక్సికో సిటీ: మెక్సికోలోని ఓ పాఠశాలలో గురువారం ఉదయం జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు మృతిచెందారు. డజను మందికి పైగా గాయపడినట్లు తెలిసింది. న్యూ మెక్సికోలోని అల్బుకుర్కేకు సుమారు 180 మైళ్ల దూరంలో ఉన్న అజ్‌టెక్‌ హైస్కూల్‌లో ఈ ఘటన జరిగింది. మృతుల్లో ఇద్దరు విద్యార్థులతో పాటు కాల్పులకు పాల్పడిన వ్యక్తి ఉన్నట్లు భావిస్తున్నారు. అయితే షూటర్‌ ఎలా చనిపోయాడన్నదానిపై స్పష్టత రాలేదు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడా లేక యాదృచ్ఛికంగా జరిగిందా అన్నది తెలియరాలేదు. విద్యార్థులందరినీ పాఠశాల నుంచి బయటికి పంపించి ప్రత్యేక బస్సుల్లో ఇళ్లకు తరలించారు.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top