
కృష్ణాజిల్లా : కార్పొరేట్ కాలేజీ యాజమాన్యం వేధింపులు మరో విద్యార్థిని బలి తీసుకున్నాయి. వివరాలు.. వేపెనమలూరు మండలం ఈడ్పుగల్లలోని నారాయణ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోన్న ఓ విద్యార్ధి హస్టల్ గదిలో ఫ్యాన్‌కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతున్ని కర్నూలు జిల్లా డోన్‌కు చెందిన ఆత్మకూరు శ్రీ చరణ్‌గా గుర్తించారు. యాజమాన్యం వేధింపుల వల్లే తమ పిల్లాడు మరణించాడని శ్రీ చరణ్ బంధువులు ఆరోపించారు. అయితే కాలేజీ యాజమాన్యం మాత్రం విద్యార్థి ఆత్మహత్యను గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించింది.