సెక్స్‌ రాకెట్‌.. ముగ్గురు నటీమణులకు విముక్తి

Mumbai Police Bust Immoral Activities In Andheri - Sakshi

ముంబై : నగరంలోని ఓ త్రీ స్టార్‌ హోటల్‌ల్లో సాగుతున్న హై ప్రొఫైల్‌ సెక్స్‌ రాకెట్‌ గుట్టును ముంబై పోలీసులు ఛేదించారు. ఈ రాకెట్‌కు నిర్వహిస్తున్న ప్రియా శర్మను(29) పోలీసులు అరెస్ట్‌ చేశారు. అలాగే వ్యభిచార కూపం నుంచి ముగ్గురు అమ్మాయిలకు పోలీసులు విముక్తి కల్పించారు. వారు ముగ్గురు కూడా నటీమణులే కాగా.. అందులో ఓ మైనర్‌ కూడా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మాట్లాడుతూ..‘సిటీ పోలీసు సోషల్‌ సర్వీసు బ్రాంచ్‌ తూర్పు అంధేరిలోని ఓ హోటల్‌పై గురువారం దాడులు చేపట్టింది. హోటల్‌లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రియా శర్మను అరెస్ట్‌ చేశాం. అలాగే ముగ్గురు అమ్మాయిలను రక్షించాం. అందులో ఒకరు మైనర్‌ ఉన్నారు. 

ఆ ముగ్గురిని కూడా బలవంతంగా వ్యభిచార కూపంలోకి తీసుకువచ్చినట్టుగా గుర్తించాం. ప్రియా శర్మ కందివాలి తూర్పులో టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ బిజినెస్‌ చేస్తుంది. అంతేకాకుండా ఇలాంటి అనైతిక కార్యకలాపాలు నిర్వహిస్తుంది. మేము కాపాడినవారిలో ఒకరు ఓ ప్రముఖ టీవీ చానల్‌ నిర్వహించే క్రైమ్‌ షోలో పనిచేశారు. మరోకరు మరాఠీ చిత్రాల్లో, సీరియల్స్‌లో నటిస్తున్నారు. మైనర్‌ నటి ఓ వెబ్‌ సిరీస్‌లో నటించారు’ అని తెలిపారు. కాగా, ఇటీవల సెక్స్‌ రాకెట్‌ నడుపుతున్న ఓ బాలీవుడ్‌ ప్రొడక్షన్‌ మేనేజర్‌ను కూడా ముంబై పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top