
అదృశ్యమైన తల్లీ, కొడుకు
అడ్డగుట్ట: ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిన తల్లీకొడుకులు అదృశ్యమయ్యారు. ఈ ఘటన తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ శ్రీను తెలిపిన మేరకు.. తుకారాంగేట్ సాయినగర్ ప్రాంతానికి చెందిన నారపాక భాగ్యశ్రీ(22) తన ఏడు నెలల బాలుడు క్రిష్‌తో కలిసి శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆమె భర్త గిరిధర్ పరిసర ప్రాంతాల్లో వెతికినా, తెలిసిన వారిని వాకబు చేసినా ఫలితం కనిపించలేదు. దీంతో తుకారాంగేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.