
మానస, వర్షిణి (ఫైల్) జ్యోతి(ఫైల్)
చందానగర్: తల్లి, కూతురు అదృశ్యమైన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్‌లో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా, షాద్‌నగర్‌కు చెందిన మానసకు శేరిలింగంపల్లి తారానగర్‌కు చెందిన రఘువీర్‌తో 2013లో వివాహం జరిగింది. వారిద్దరూ ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. వారికి కూతురు వర్షిణి(3) ఉంది. భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి మానస తన సోదరుడు శ్రీనివాస్‌కు ఫోన్ చేసి ‘నేను ఇంటి నుంచి వెళ్లిపోతున్నాను. నా కోసం వెతకొద్దు ..నా కూతురితో కలిసి ఎక్కడికైనా వెళ్లి బతుకుతామని చెప్పింది. మానస సోదరుడు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
గృహిణి అదృశ్యం
చిక్కడపల్లి: గృహిణి అదృశ్యమైన సంఘటన చిక్కడపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. సీఐ సైరెడ్డి వెంకట్‌రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బాగ్‌లింగంపల్లి నెహ్రునగర్‌కు చెందిన జ్యోతి భర్తతో గొడవపడి ఇద్దరు కుమారులతో కలిసి తల్లి వద్దే ఉంటోంది. జ్యోతి భర్త పాండు తరచూ మద్యం తాగి అక్కడికి వచ్చి భార్యతో గొడవపడేవాడు. ఈ నెల 14న అతను భార్య, అత్తతో గొడవపడ్డాడు. 15న మధ్యాహ్నం బయటికి వెళ్లిన జ్యోతి తిరిగి రాకపోవడంతో ఆమె తల్లి సరస్వతి ఆదివారం చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ సైదులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.