
అదృశ్యమైన ముజాసిం,ఆశ (ఫైల్)
బహదుర్‌పురా: కుమార్తెతో సహా ఓ మహిళ అదృశ్యమైన సంఘటన బహదూర్‌పురా పోలీస్ సేష్టన్ పరిధిలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కిషన్‌బాగ్ నంది ముస్లాయిగూడాలో హుస్సేన్, ముజాసిం దంపతులు కుమార్తె ఆశ (3)తో కలిసి ఉంటున్నారు. ఈ నెల 8న బాషా బయటికి వెళ్లగా ముజసీం కుమార్తె ఆశను తీసుకుని బయటికి వెళ్లింది. సాయంత్రం ఇంటికి వచ్చిన బాషాకు భార్యా బిడ్డలు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన అతను స్థానికులను విచారించాడు. ఉదయం 11 ప్రాంతంలో ముజాసిం కుమార్తెతో సహా బయటికి వెళ్లినట్లు తెలిపారు. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన షఫీ అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. బహదూర్‌పురా పోలీసులు కేసు నమోడు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.