ఎమ్మెల్సీ యండపల్లికి రెండేళ్ల జైలు

 MLC Yandapalli Srinivasulu Reddy and 11 others get two year jail  - Sakshi

సాక్షి, చిల్లకూరు: విధి నిర్వహణలో ఉన్న సీఐను అడ్డుకుని అతనిపై దాడికి పాల్పడిన కేసులో చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డితోపాటు మరో 10 మందికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం శ్రీపొట్టిశ్రీరాములు నె ల్లూరు జిల్లా  గూడూరు అడిషనల్‌ జుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ ఎన్‌.లావణ్య తీర్పు చెప్పారు.

చిల్లకూరు ఎస్సై కె.శ్రీనివాసరావు కథనం మేరకు.. మండలంలోని అంకులపాటూరులో 2011 అక్టోబర్‌ 3న వీఎస్‌ఎఫ్‌ అనే కంపెనీ విద్యుత్‌ పరిశ్రమ ఏర్పాటు కోసం ప్రజాభిప్రాయసేకరణ అప్పటి తహసీల్దార్‌ రోజ్‌మాండ్‌ అధ్యక్షతన చేపట్టారు. ఈ కార్యక్రమానికి అప్పటి జేసీ సౌరభ్‌గౌర్‌ కూడా హాజరు అయ్యారు. ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతున్న పలువురు వ్యక్తులు విద్యుత్‌ పరిశ్రమకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడటంతో ఆ సమయంలో బందోబస్తు నిర్వహిస్తున్న అప్పటి గూడూరు పట్టణ సీఐ జె రాంబాబుపై పలువురు దాడిచేసి గాయపరిచారు. దీంతో అప్పట్లో నిందితులపై 143, 147, 148, 332, 447, 290 ఐపీసీ సెక‌్షన్ల కింద కేసు నమోదు చేసి, 12 మందిపై చార్జిషీట్‌ దాఖాలు చేశారు.

ఈ కేసు విచారణలో నిందితులపై నేరారోపణలు రుజువు కావడంతో శుక్రవారం మేజిస్ట్రేట్‌ ఒక్కొక్కరికి  రెండేళ్ల జైలు శిక్షతోపాటు రూ.4,700 జరిమానా విధిస్తూ  తీర్పు చెప్పారు. ఈ కేసులో మరో నిందితుడు నెల్లూరుకు చెందిన ప్రముఖ వైద్యుడు విజయకుమార్‌ మృతి చెందడంతో మిగిలిన ఎమ్మెల్సీ యండవల్లి శ్రీనివాసులురెడ్డి, ఎం.రాజేష్‌కుమార్, కె బాలయ్య, జాస్తి కిషోర్, టీహెచ్‌ కోటిరెడ్డి, కటికాల వెంకటేశ్వర్లు, సీహెచ్‌ అంజిరెడ్డి, వి వెంకటరమణయ్య, సీహెచ్‌ నాగరాజు, జి రామకృష్ణయ్య, కేవీ కృష్ణయ్య ఉన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top