గీతిక సూసైడ్‌ నోట్‌ దొరికింది

Medico Committed Suicide Because Of Mothers Disapproval Revealed Through Suicide Note - Sakshi

సాక్షి, తిరుపతి: పోలీసుల చేతికి మెడికో గీతిక సూసైడ్‌ నోట్‌ దొరికింది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ సెకండియర్‌ చదువుతున్న గీతిక ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. గీతిక ఇటీవల ఓ యువకుడిని ప్రేమించింది. ఈ విషయం తల్లికి చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంది. ఇందులో భాగంగా గీతిక, తన తల్లి హరితా దేవికి ఇటీవల ప్రేమ విషయం చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పింది. దీంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి.

మనస్తాపం చెందిన గీతిక, పెళ్లికి తల్లి ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలని భావించి బలవన్మరణానికి పాల్పడింది. చనిపోయే ముందు సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. తాను పిరికి దానిని కాదని..తప్పని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో తెలిపింది. ప్రేమించిన మనిషితో పెళ్లి జరగకుండా ఉండలేనని, జీవితంలో ఓడిపోతానని ఎప్పుడూ అనుకోలేదని, తనను క్షమించాలని పేర్కొంది.

అయితే చదువులో వత్తిడి వల్లే తన కుమార్తె గీతిక ఆత్మహత్య చేసుకుందని, మరే ఇతర కారణాలు లేవని ఆమె తల్లి హరితా దేవి పేర్కొన్నారు. కాగా, గీతిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, పూర్తి విచారణ చేసి వాస్తవాలు వెల్లడిస్తామని డీఎస్పీ ముని రామయ్య తెలిపారు.


గీతిక రాసిన సూసైడ్‌ నోట్‌..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top