
సత్యనాగరాణి మృతదేహం
మియాపూర్: భవనం పైనుంచి దూకి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. సీఐ వెంకటేష్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. విజయవడకు చెందిన నేతాజీ, వెంకట మాణెమ్మ దంపతుల కుమార్తె ఉమా వెంకట సత్యనాగరాణి (33)కి తూర్పుగోదావరి రావులపాలెం కాసూరినగర్‌కు చెందిన శివకుమార్‌తో వివాహం జరిగింది. గత కొంతకాలంగా వీరు మియాపూర్ డైమండ్ హిల్స్ –3 ఉంటున్నారు. మంగళవారం ఉదయం శివకుమార్ ఇంట్లో లేని సమయంలో ఉమ అపార్ట్‌మెంట్ 5వ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు ఆమెను కేపీహెచ్‌బీలోని అనుపమ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.