ఆమెది గుండెపోటు కాదు.. హత్యే! | Married Woman Died In Suspicious Circumstances In West Godavari | Sakshi
Sakshi News home page

Sep 12 2018 12:48 AM | Updated on Sep 12 2018 12:48 AM

Married Woman Died In Suspicious Circumstances In West Godavari - Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి : జిల్లాలోని నిడమర్రు మండలం అడవికొలను గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కట్నం కోసం, పిల్లలు లేరనే కారణంగా పాపోలు నాగలక్ష్మి (25)అనే వివాహితను అత్తమామలు, భర్త హత్య చేశారని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ఆదివారం ఉదయం నాగలక్ష్మి అనుమానస్పద స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. గుండెపోటు కారణంగానే నాగలక్ష్మి చనిపోయిందంటూ నమ్మించిన అత్తింటివారు.. కంగారుగా ఆమె మృతదేహాన్ని ఖననం చేశారనీ... కట్నం కోసం నాగలక్ష్మిని ఆమె భర్త కిరణ్‌ తరచూ వేధించేవాడని బంధువులు అంటున్నారు. పోస్టుమార్టం చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని వారు ఆందోళనకు దిగారు. కాగా, తహసీల్దార్‌, పోలీసుల సమక్షంలో ఖననం చేసిన మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా.. కొంతకాలం క్రితం భార్య పేరు మీద కిరణ్‌ 12 లక్షల రూపాయల బీమా చేయడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement