గంజాయి చాక్లెట్ల పట్టివేత

Marijuana Chocolates Smuggling In Hyderabad - Sakshi

కుత్బుల్లాపూర్‌: గంజాయి విక్రయదారులు రూటు మార్చారు.. గంజాయి విక్రయాలపై పోలీసులు దాడులు ముమ్మరం చేసిన నేపథ్యంలో వారి కళ్లుగప్పేందుకు చాక్లెట్ల రూపంలో అమ్మకాలు చేపట్టారు.. దీనిపై సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్‌ సీఐ సహదేవ్, సిబ్బంది మాటు వేసి విక్రయదారుడిని అరెస్ట్‌ చేశారు. వివరాల్లోకి వెళితే.. బాచుపల్లి ప్రధాన రహదారిలో పాన్‌షాప్‌ నిర్వహిస్తున్న దేవేంద్రకుమార్‌ దాస్‌ చాక్లెట్ల రూపంలో గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించి నిందితుడు దాస్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 400 గ్రాముల గంజాయి,  260 గంజాయి చాక్లెట్లు, సెల్‌ఫోన్, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని తదుపరి విచారణ నిమిత్తం కుత్బుల్లాపూర్‌ ఎక్సైజ్‌ పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన టాస్క్‌ఫోర్స్‌ సీఐ సహదేవ్, సిబ్బందిని మేడ్చల్‌ జిల్లా ఎక్సైజ్‌ సూపరిండెంట్‌ గణేష్‌గౌడ్‌ అభినందించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top