వ్యక్తి చెవిలో నుంచి బుల్లెట్‌.. ఆపై భార్య మెడలోకి

Man Shoots Self In Ear And Bullet Comes Out His Head Hits Wife - Sakshi

గురుగ్రామ్‌/ఢిల్లీ : తుపాకీతో కాలిస్తే బుల్లెట్‌ శరీరంలోకి నుంచి బయటికి వచ్చి మరో వ్యక్తి శరీరంలోకి చొచ్చుకుపోవడం సినిమాల్లో చూస్తుంటాం. అయితే అది సినిమా కాబట్టి సరిపెట్టుకుంటాం.. కానీ నిజజీవితంలో మాత్రం అలా జరగడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. తాజాగా హర్యానాలోని గురుగ్రామ్‌ పట్టణంలో ఒక వ్యక్తి తన తుపాకీతో చెవిలో కాల్చుకుంటే అది అతని తలలో నుంచి బయటకు వచ్చి పక్కనే ఉన్న అతని భార్య మెడలోకి దూసుకెళ్లింది. ప్రస్తుతం ఆ వ్యక్తి ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండగా, ఏడు నెలల గర్భవతి అయిన అతని భార్య మాత్రం ప్రాణాపాయం నుంచి బయటపడింది.(గొర్రెకుంట ఘటన: అసలేం జరిగింది?)

డిసిపి దీపక్‌ సహరణ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ' ఫైరదాబాద్‌కు చెందిన ఆ వ్యక్తి ఐదు నెలల క్రితం గురుగ్రామ్‌లోని రామ్‌పురాకు వచ్చి అద్దెకు ఉంటున్నాడు. అయితే ఆ వ్యక్తికి ఇప్పటికే రెండుసార్లు పెళ్లయిందని, 2017లో మొదటి భార్యను విడిచిపెట్టిన అతను 2019లో మధురకు మకాం మార్చాడు. అక్కడ ఒక గ్రాసరీ స్టోర్‌లో పనిచేస్తూ మరొకరిని పెళ్లి చేసుకున్నాడు. గత కొంతకాలంగా ఆ వ్యక్తి పని లేకపోవడంతో ఇంట్లోనే ఉంటున్నాడు. దీంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ప్రస్తుతం ఆ వ్యక్తి రెండో భార్య ఐదు నెలల గర్భవతి కావడంతో గురుగ్రామ్‌లోని ఒక ఆసుపత్రిలో రెగ్యులర్‌గా చెకఫ్‌కు వెళుతుంటారు. శనివారం కూడా ఆ వ్యక్తి తన భార్యను తీసుకొని చెకప్‌కని ఆసుపత్రికని ఎస్‌యూవీ కారులో బయలుదేరాడు. మార్గమధ్యంలో ఉద్యోగ విషయమై ఇరువరి మధ్య గొడవ జరిగింది. దీంతో సదరు వ్యక్తి ఆవేశంతో కారులో ఉన్న పిస్టోల్‌ తీసుకొని తన చెవిలో కాల్చుకున్నాడు. దీంతో అతని చెవిలో నుంచి బయటికి వచ్చిన బుల్లెట్‌ అతని భార్య మెడలోకి దూసుకెళ్లింది. కారులోనే ఇద్దరు రక్తపు మడుగులో అపస్మారకస్థితిలో ఉండిపోయారు. అయితే రోడ్డుపై అటుగా వెళుతున్న కారును పరిశీలించగా అప్పటికే వారిద్దరు సృహ లేకుండా ఉండడంతో మాకు సమాచారమందిండాని' తెలిపాడు.

దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు దంపతులిద్దరిని ఢిల్లీలోని సప్ధర్‌జంగ్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఐసీయూలో ప్రాణాపాయ స్థితిలో ఉండగా, అతని భార్య మాత్రం ప్రాణాల నుంచి బయటపడింది. గత నాలుగురోజులుగా ఉద్యోగ విషయమై తమ మధ్య గొడవ జరుగుతుందని వ్యక్తి భార్య తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఢిల్లీలోని కేరీదౌళా పోలీస్‌ స్టేషన్‌లో ఐపీసీ 309 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. 7.62 ఎంఎం తుపాకీతో కాల్చుకున్న వ్యక్తికి లైసెన్స్‌ ఉందా లేదా అనేది పరిశీలిస్తున్నట్లు తెలిపారు. సాధారణంగా తుపాకీతో కాల్చుకుంటే బుల్లెట్‌ బయటకు రావడమనేది అరుదుగా జరుగుతుంది. అతను పాయింట్‌ బ్లాక్‌లో చెవిలో కాల్చుకోవడంతోనే బుల్లెట్‌ బయటకు వచ్చిందని డిసిపి దీపక్‌ సహరణ్‌ వెల్లడించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top