తాగుడుకు డబ్బు ఇవ్వలేదని తల్లిపై పెట్రోల్ పోసి.. | Man Sets Mother On Fire For Denying Money To Buy Alcohol | Sakshi
Sakshi News home page

తాగుడుకు డబ్బు ఇవ్వలేదని తల్లిపై పెట్రోల్ పోసి..

Dec 10 2018 9:28 AM | Updated on Dec 10 2018 10:03 AM

Man Sets Mother On Fire For Denying Money To Buy Alcohol - Sakshi

నిందితుడు ఉత్తమ్‌ కుమార్‌ (ఫైల్‌ఫోటో)

మద్యం సేవించేందుకు డబ్బు ఇవ్వలేదని తల్లికి నిప్పంటించిన కసాయి..

బెంగళూర్‌ : మద్యం సేవించేందుకు డబ్బు ఇవ్వలేదని ఏకంగా తల్లికి నిప్పంటించిన కొడుకు ఉదంతం బెంగళూర్‌లో వెలుగుచూసింది. కుమారుడి నిర్వాకంతో గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సదాశివనగర్‌ ప్రాంతంలో మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వాలని 20 ఏళ్ల ఉత్తమ్‌కుమార్‌ తల్లితో గొడవపడ్డాడు.

తల్లీకొడుకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్న క్రమంలో డబ్బు ఇచ్చేందుకు నిరాకరించడంతో ఉత్తమ్‌ తన తల్లిపె పెట్రోల్‌ చల్లి నిప్పు పెట్టాడు. మహిళ భర్త ఆమెను కాపాడి ఆస్పత్రిలో చేర్పించారు. మహిళ ముఖం, చేయి, ఛాతీపై గాయాలయ్యాయి. కాగా నిందితుడు ఉత్తమ్‌ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. మరోవైపు నగరంలో ఇదే తరహా ఘటనలో తల్లిని కొట్టిన కుమారుడి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవడంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement