ప్రియురాలి కోసం.. హ‌త్య‌ చేసేందుకు 8 లక్ష‌ల సుపారి

Man Pays Rs 8 Lakh Supari To Kill His Own  Family  - Sakshi

ప్ర‌యాగ్‌రాజ్ : ప్రియురాలు మాయ‌మాట‌లు న‌మ్మి సొంత కుటుంబాన్నే హ‌త‌మార్చాడు ఓ దుర్మార్గుడు. త‌ల్లిదండ్రులతో పాటు కట్టుకున్న భార్యతో సోదరిని హ‌త‌మార్చ‌మ‌ని కిరాయి రౌడీల‌కు సుపారీ ఇచ్చి ఏమీ ఎర‌గ‌న‌ట్లు అమాయ‌కుడిలా న‌టించాడు. తీగ లాగితే డొంక క‌దిలిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో నిజ‌నిజాలు బ‌య‌ట‌ప‌డటంతో మొత్తం వ్య‌వ‌హారం ఓ కొలిక్కి వ‌చ్చింది. పోలీసుల వివరాల ప్రకారం..ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌యాగ్‌రాజ్ ప్రీత‌మ్‌న‌గ‌ర్‌కు చెందిన ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త తుల‌సీదాస్ (65),ఆయ‌న భార్య కిర‌ణ్ (60), కూతురు నిహారిక (37), కోడ‌లు ప్రియాంక (22)లు దారుణ హ‌త్య‌కు గురి కావ‌డంతో స్థానికంగా క‌ల‌క‌లం రేగింది. ( అత్యాచార ఆరోప‌ణ‌ల‌తో బీజేపీ నేత అరెస్ట్ )

ఈ విష‌యాన్ని మొద‌ట‌గా కూమారుడు ఆతీష్ పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌డంతో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. దీనిలో భాగంగా ఇంటి సీసీటీవి ఫుటేజీ ప‌ని చేయ‌క‌పోవ‌డం, వీడియో రికార్డుల పాస్‌వ‌ర్డ్ చెప్ప‌డానికి ఆతీష్ నిరాక‌రించ‌డంతో పోలీసులకు అనుమానం మొద‌లైంది. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేయగా, నేరం తానే చేసిన‌ట్లు అంగీక‌రించాడు.

ఈ ఘాతుకానికి పాల్పడటానికి గల కారణాల్లోకి వెళితే...వివాహితుడైన ఆతీష్ అదే ప్రాంతానికి చెందిన రంజ‌నా శుక్లాతో ప్రేమాయ‌ణం న‌డిపిస్తున్నాడు. (భర్త చేతిలో భార్య దారుణ హత్య )  ఈ నేప‌థ్యంలో ఆస్తిపై క‌న్నేసిన ఆమె.. కుటుంబం మొత్తాన్ని హ‌త్య  చేస్తే ఇక ఆస్తి ద‌క్కుతుంద‌ని న‌మ్మ‌బ‌లికింది. రంజ‌నా ప్ర‌భావం త‌న‌పై చాలా ఉంద‌ని, అందుకే ప్రియురాలి మాట కాద‌న‌లేక పోయాన‌ని దర్యాప్తులో వెల్ల‌డించాడు. దీంతో అనుజ్ శ్రీ వాస్త‌వ అనే కిరాయి హంత‌కుడికి 8 లక్ష‌ల సుపారీ ఇచ్చి బేరం కుదుర్చుకున్నాడు. ప‌థ‌కం ప్ర‌కారం హ‌త్య చేసిన అనుజ్ శ్రీ వాస్త‌వ‌, అత‌నికి సాయం అందించిన ఉమేంద్ర ద్వివేదీతో పాటు  ఆతీష్, రంజనా శుక్తాల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి విలువైన బంగారం, లక్ష రూపాయ‌ల న‌గ‌దు, మొబైల్ పోన్ల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. (ఛాతీపై కాల్చుకున్నాడు.. )

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top