మరో గంటలో కుమార్తె వివాహం.. | Man Died By Heart Attack | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో తండ్రి మృతి

May 11 2018 11:10 AM | Updated on Aug 16 2018 4:36 PM

Man Died By Heart Attack - Sakshi

ఇస్త్రాఫిల్‌ (ఫైల్‌)

చింతపల్లి : ఆ ఇళ్లంతా పెళ్లి సందడితో కళకళలాడుతోంది... బంధు మిత్రులు అప్పటికే వచ్చేశారు.. పెళ్లి కుమారుడు కూడా మరోగంటలో వచ్చేస్తాడనగా హఠాత్తుగా పెళ్లి కుమార్తె తండ్రి గుండెపోటుకు గురై మృతిచెందాడు.. దీంతో పెళ్లి వేడుకలు నిలిచిపోయి విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటన గురువారం చింతపల్లి మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని కుర్మేడు గ్రామానికి చెందిన షేక్‌ ఇస్త్రాఫిల్‌(53) గ్రామంలోనే కూలీగా చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

తన ఒక్కగానొక్క కుమార్తె హసినా బేగానికి చండూరు మండలం కుడుకుడ గ్రామానికి చెందిన మహమ్మద్‌ జావీద్‌తో గురువారం మండలకేంద్రంలోని సాయి సుమంగళి గార్డెన్స్‌లో వివాహం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. మరో గంట లో వివాహం జరగాల్సి ఉండగా ఇస్త్రాఫిల్‌ ఒక్కసారిగా హఠాత్తుగా గుండెపోటుకు గురై మృతి చెం దాడు. దీంతో పెళ్లి వేడుక నిలిచిపోగా కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. వివా హ వేడుక జరగాల్సిన ఆ ఇంట్లో విషాదం చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement