పెళ్లి చేసుకొంటానని నమ్మించి.. | Man Cheated Young Girl Over Marriage Proposal | Sakshi
Sakshi News home page

ప్రేమ పేరుతో విద్యార్థినిపై అత్యాచారం

Apr 22 2019 9:02 AM | Updated on Apr 22 2019 9:02 AM

Man Cheated Young Girl Over Marriage Proposal - Sakshi

హొసూరు: పెళ్లి చేసుకొంటానని నమ్మించి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ఆర్మీ సైనికునితో పాటు ఐదు మందిపై క్రిష్ణగిరి మహిళా పోలీసులు కేసులు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. వివరాల మేరకు.. క్రిష్ణగిరి సమీపంలోని పూవత్తి గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి అదే ప్రాంతంలోని ప్రైవేట్‌ కళాశాలలో బిఎస్సీ రెండవ ఏడాది చదువుతోంది. ఆలంబాడి గ్రామానికి చెందిన గాంధీ (25) సైనికోద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ తరుణంలో విద్యార్థినితో గాంధీకి పరిచయమేర్పడి ప్రేమిస్తున్నట్లు నమ్మించాడు. గతేడాది డిసెంబర్‌ నుంచి యువతితో ప్రేమాయణం సాగిస్తున్నాడు.   పలుమార్లు అఘాయిత్యం  ఈ సమయంలో పెళ్లి చేసుకొంటానని ఆశచూపి పలు సార్లు విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

విద్యార్థిని పెళ్లి చేసుకుందామని కోరగా, గాంధీ నిరాకరించడంతో మోసపోయినట్లు గ్రహించింది. న్యాయం చేయాలంటూ   మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదులో గాంధీ తనను ప్రేమించాడని, పెళ్లి చేసుకొంటానని ఆశచూపి అత్యాచారానికి పాల్పడ్డాడని, అదే ప్రాంతానికి చెందిన సుమతి, మునియమ్మ, మురుగన్, మునిరాజ్‌లు అతనికి సహకరించారని పేర్కొంది. పోలీసులు కేసులు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement