ప్రేమ,పెళ్లి పేరుతో మహిళను వంచించి.. | Man Arrested Over Cheating Married Woman In Hyderabad | Sakshi
Sakshi News home page

ప్రేమ,పెళ్లి పేరుతో మహిళను వంచించి..

Jun 14 2020 1:09 PM | Updated on Jun 14 2020 1:29 PM

Man Arrested Over Cheating Married Woman In Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌ : ఓ మహిళను ప్రేమ, పెళ్లి పేరుతో వంచించి జైలు పాలయ్యాడో యువకుడు. ఈ సంఘటన మల్కాజ్‌గిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సికింద్రాబాద్‌, బోయగూడకు చెందిన ఓ మహిళ (22) భర్తతో గొడవపడి కుమారుడితో కలిసి మౌలాలి భరత్‌నగర్‌లో పది నెలలుగా వేరుగా ఉంటోంది. ఈ క్రమంలో‌ మౌలాలి, షపీనగర్కి చెందిన ఆటోడ్రైవర్‌ మహ్మద్‌ సమీర్‌(19) ఆమెతో పరిచయం పెంచుకుని స్నేహంగా ఉంటున్నాడు. ( ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో..)

వారి స్నేహం ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే ఇద్దరు కలిసిమెలిసి ఉన్నారు. అతడామెను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి, చివరకు మోసం చేశాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement