సెల్‌ ఫోన్లో వేధింపులు | Man Arrest in Phone Harassment Case Hyderabad | Sakshi
Sakshi News home page

సెల్‌ ఫోన్లో వేధింపులు పోలీసుల అదుపులో నిందితుడు

Oct 16 2019 11:07 AM | Updated on Oct 16 2019 11:07 AM

Man Arrest in Phone Harassment Case Hyderabad - Sakshi

నిందితుడు సీతారాం

బంజారాహిల్స్‌: ఫోన్‌లో యువతిని వేధిస్తున్న యువకుడిని బంజారాహిల్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎల్బీ నగర్‌కు చెందిన సీతారాం ఇంటర్‌ చదివాడు. మద్యానికి బానిసైన ఆవారాగా తిరుగుతున్నాడు. గతంలో తనకు తెలిసిన ఓ యువతి ద్వారా బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 2లోని ఇందిరానగర్‌కు చెందిన ఆమె స్నేహితురాలి ఫోన్‌ నం బర్‌ తెలుసుకున్న అతను గత నెల రోజులుగా ఆమెకు ఇష్టారాజ్యం గా ఫోన్లు చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు. బాధితురాలు ఈ  విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు పథకం ప్రకారం సీతారాంను ఇందిరానగర్‌కు రప్పించారు. సోమవారం రాత్రి ఆమె సూచించిన ప్రాంతానికి వచ్చిన నిందితుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement