breaking news
phone harassment
-
సెల్ ఫోన్లో వేధింపులు
బంజారాహిల్స్: ఫోన్లో యువతిని వేధిస్తున్న యువకుడిని బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎల్బీ నగర్‌కు చెందిన సీతారాం ఇంటర్ చదివాడు. మద్యానికి బానిసైన ఆవారాగా తిరుగుతున్నాడు. గతంలో తనకు తెలిసిన ఓ యువతి ద్వారా బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని ఇందిరానగర్‌కు చెందిన ఆమె స్నేహితురాలి ఫోన్ నం బర్ తెలుసుకున్న అతను గత నెల రోజులుగా ఆమెకు ఇష్టారాజ్యం గా ఫోన్లు చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు. బాధితురాలు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు పథకం ప్రకారం సీతారాంను ఇందిరానగర్‌కు రప్పించారు. సోమవారం రాత్రి ఆమె సూచించిన ప్రాంతానికి వచ్చిన నిందితుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహితకు ఫోన్లో వేధింపులు
ఉప్పలగుప్తం : ఇటీవల వివాహమైన తన కు ఫోన్ చేసి వేధిస్తున్న వ్యక్తిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపిస్తూ ఓ మహిళ తన భర్తతో కలిసి ఉప్పలగుప్తం పోలీసు స్టేషన్ ముందు మంగళవారం రాత్రి బైఠాయించింది. బాధితురాలి కథనం ప్రకారం.. ఈ ఏడాది మార్చి ఏడున కిత్తనచెరువుకు చెందిన పులపర్తి నానిబాబుతో సత్యశైలకు వివాహమైంది. అదే గ్రామానికి చెందిన పోతుల నాగేశ్వరరావు(నాగు) అనే వ్యక్తి ఆమెకు తరచూ ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నాడు. ఈ విషయాన్ని తన భర్తకు చెప్పినా.. నాగేశ్వరరావు నుంచి ఫోన్‌కాల్స్ ఆగలేదు. దీనిపై స్థానిక పోలీసుస్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. గ్రామ పెద్దల ద్వారా చెప్పించినా.. ఎస్సై స్వామినాయుడు పట్టించుకోలేదు. ఈ క్రమంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ భార్యాభర్తలు పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించారు. మాజీ సర్పంచ్ యల్లమిల్లి రాముతో పాటు పలువురు గ్రామస్తులు వారికి అండగా నిలిచారు. దీనిపై ఎస్సై స్వామినాయుడును వివరణ కోరగా, ఆ వ్యక్తిని పిలిపిస్తానని చెప్పారు.