ప్రేమ వ్యవహారమే పొట్టన పెట్టుకుంది

Man Allegedly Kills Young Man Due To Love Affairs In Tamil Nadu - Sakshi

సాక్షి, చెన్నై : ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు యువకుల మధ్య ఏర్పడిన ఘర్షణ ఒకరి హత్యకు దారితీసింది. తిరువళ్లూరు జిల్లా ఎగువనల్లాటూరు గ్రామానికి చెందిన మహేష్‌కుమార్‌ (20) దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం ఇతడిని దారుణంగా హత్య చేసి చెరువులో పూడ్చే ప్రయత్నం చేశారు. సమీపంలోని పశువుల కాపర్లు గుర్తించడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. సగం మాత్రమే పూడ్చిన శవాన్ని పోలీసులు వెలికితీశారు. తిరువళ్లూరు తాలుకా పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. హత్యకు గురైన మహేష్‌ కుమార్‌ సెల్‌ఫోన్‌ ఆధారంగా డేటా సేకరించిన పోలీసులు అనుమానితులు మణిబారతి, సుకుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో పలు అసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

మనవాలనగర్‌కు చెందిన మణిబారతి అదే ప్రాంతానికి చెందిన యువతిని గత మూడు సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే అమ్మాయిని మహేష్‌కుమార్‌ సైతం ప్రేమిస్తున్నట్టు తెలుసుకున్న మణిభారతి పలు సార్లు మహేష్‌కుమార్‌ను హెచ్చరించినట్టు తెలుస్తుంది. అమ్మాయి కోసం ఇద్దరు యువకులు పలుమార్లు ఘర్షణ కూడా పడినట్టు పోలీసుల విచారణలో తేలింది. మహేష్‌కుమార్‌ ప్రవర్తనలో మార్పు లేకపోవడంతో అతడిని హత్య చేయాలని ప్రణాళిక రచించి స్నేహితుల సాయంతో హత్య చేసినట్టు మణిభారతి అంగీకరించారు. దీంతో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు మరో ఐదు మంది కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు గాలస్తున్న విషయం తెలుసుకున్న నిందితులు అజిత్‌(18), శివలింగం(19) కార్తీక్‌(19) విఘ్నేష్‌(20) దినేష్‌(18) ఎగ్మోర్‌ కోర్టులో లొంగిపోయారు. 

నిందితులు సుకుమారన్, మణిభారతి 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top