ఆవేశంలో యాసిడ్‌ తాగి ఆత్మహత్య! | Man Acid Attack On Wife And Daughters Then Drink It | Sakshi
Sakshi News home page

భార్య, కూతుళ్లపై యాసిడ్ దాడి.. ఆపై!

Jun 10 2018 3:55 PM | Updated on Aug 17 2018 2:10 PM

Man Acid Attack On Wife And Daughters Then Drink It - Sakshi

న్యూఢిల్లీ : భార్యతో గొడవపడ్డ ఓ వ్యక్తి విచక్షణ కోల్పోయాడు. కుటుంబంపై యాసిడ్‌ దాడికి పాల్పడి చివరికి తాను సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన న్యూఢిల్లీలోని కర్వాల్‌ నగర్‌లో శనివారం చోటుచేసుకుంది. 40 ఏళ్ల వ్యక్తి భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి స్థానికంగా నివాసం ఉండేవాడు. గత కొన్నేళ్లుగా భార్యాభర్తలు ఏదో విషయంపై గొడవ పడేవారు. ఈ క్రమంలో మరోసారి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలొచ్చాయి. దీంతో ఆవేశంగా బయటకు వెళ్లిపోయిన భర్త యాసిడ్‌ బాటిల్స్‌ కొని నేరుగా ఇంటికొచ్చాడు.

తొలుత భార్యపై యాసిడ్‌ దాడికి పాల్పడ్డ అతడు తర్వాత ఇద్దరు కుమార్తెలపై కూడా యాసిడ్‌ పోశాడు. ఆపై ఆ వ్యక్తి యాసిడ్‌ తాగి బలవన్మరణం చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చూసేసరికి భర్త చనిపోయాడు. ఆ వ్యక్తి భార్య 40 శాతం కాలిన గాయాలతో విషమ పరిస్థితిలో ఉండగా.. వారి కుమార్తెలకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని జీటీబీ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement