ఫ్లెక్సీ కడుతూ మహేష్‌బాబు అభిమాని దుర్మరణం

Mahesh Babu Fan Died Due To Electric Shock - Sakshi

రాజమహేంద్రవరంలో ఘటన

ధవళేశ్వరం (రాజమహేంద్రవరం రూరల్‌) : ఫ్లెక్సీ కడుతుండగా విద్యుదాఘాతానికి గురై హీరో మహేష్‌బాబు అభిమాని మృతి చెందిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మండలం ధవళేశ్వరంలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. ఇండస్ట్రియల్‌ కాలనీకి చెందిన హార్లిక్స్‌ ఫ్యాక్టరీ ఉద్యోగి యర్రంశెట్టి రాజీవ్‌ (27) మహర్షి విడుదల సందర్భంగా.. ఐరన్‌ ఫ్రేమ్‌తో కూడిన ఫ్లెక్సీ కట్టేందుకు మరో వ్యక్తితో కలసి.. మురళీకృష్ణ థియేటర్‌ పక్కన బిల్డింగ్‌పైకెక్కాడు. ఫ్లెక్సీ ఫ్రేమ్‌ విద్యుత్‌ వైర్లకు తగలడంతో విద్యుదాఘాతానికి గురైన రాజీవ్‌ ఒక్కసారిగా బిల్డింగ్‌పై నుంచి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని 108లో రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతిచెందాడు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top