క్రికెటర్‌ దారుణ హత్య..! | Maharashtra Cricketer Stabbed To Death By Three Unknown Assailants | Sakshi
Sakshi News home page

క్రికెటర్‌ దారుణ హత్య..!

Jun 7 2019 9:04 AM | Updated on Jun 7 2019 12:22 PM

Maharashtra Cricketer Stabbed To Death By Three Unknown Assailants - Sakshi

ముంబై : మహారాష్ట్రకు చెందిన ఓ క్రికెటర్‌ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. గురువారం రాత్రి (జూన్‌ 6) బందప్‌ ప్రాతంలో ఈ ఘటన జరిగింది. ముగ్గురు వ్యక్తులు  క్రికెటర్‌ రాకేష్‌ పవార్‌ను కత్తులతో పొడిచి చంపినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టామని అన్నారు. సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. స్థానికంగా ఉన్న ఫ్యుయల్‌ స్టేషన్‌కు రాకేష్‌ పెట్రోల్‌ కోసం వచ్చిన క్రమంలోనే ఈ హత్య జరిగినట్టు ప్రాథమిక సమాచారం. మహారాష్ర కికెట్‌ టీమ్‌లో కొనసాగుతున్న రాకేష్‌ రంజీ జట్టులో ఆడేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఘటనపై రాకేష్‌ చిన్ననాటి మిత్రుడు గోవింద్‌ రాథోర్‌ మాట్లాడుతూ.. ‘హత్యకు గురైన సమయంలో రాకేష్‌తో పాటు అతని గాళ్‌ఫ్రెండ్‌ ఉంది. స్థానికంగా ఉండే ఖాన్‌ ఫ్యామిలీతో అతనికి పాత గొడవలున్నాయి. రాకేష్‌ కొంతమందికి క్రికెట్‌ కోచింగ్‌ ఇస్తున్నాడు’ అని వెల్లడించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement