భగ్నప్రేమికుల బలవన్మరణం | Lovers suicide at suryapet | Sakshi
Sakshi News home page

భగ్నప్రేమికుల బలవన్మరణం

Dec 17 2017 2:38 AM | Updated on Dec 17 2017 4:13 AM

Lovers suicide at suryapet - Sakshi

ప్రశాంత్, శాలిని (ఫైల్‌)

కోదాడ/నేరేడుచర్ల: భగ్నప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.  ప్రేమించిన అమ్మాయికి మరో వ్యక్తితో బలవంతంగా నిశ్చితార్థం చేయడాన్ని తట్టుకోలేక యువకుడు ఆత్మహత్యకు పాల్పడగా, తను లేకుండా జీవించలేనని అమ్మాయి కూడా బలవన్మరణం చెందింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ, నేరేడుచర్లలో శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. నేరేడుచర్లకు చెందిన గూడూరు ప్రశాంత్‌ (25) అలియాస్‌ ఉప్పి కోదాడలోని ఓ  ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. కోదాడకు వచ్చిపోయే క్రమంలో కోదాడలోని వీటీ కాలనీకి చెందిన శాలిని (18) అనే బంధువుల అమ్మాయితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. శాలిని కోదాడలోని ఓ డిగ్రీ కాలేజీలో ప్రథమ సంవత్సరం చదువుతోంది. కొద్ది రోజుల క్రితం వీరి ప్రేమకు శాలిని తల్లిదండ్రులకు అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో కృష్ణా జిల్లాకు చెందిన వేరే వ్యక్తితో నిశ్చాతార్థం చేశారు.  

వీడియోకాల్‌లోనే ఆత్మహత్యకు నిర్ణయం 
నేరేడుచర్లలో శుక్రవారం రాత్రి మిత్రులతో మాట్లాడి ఇంటికి వచ్చాడు. ఉదయం 6 గంటలకే తనను నిద్ర లేపాలని ఎదురింట్లో ఉండే ఓ మహిళకు  చెప్పాడు. అయితే.. శనివారం ఉదయం ఆమె వచ్చి తలుపుకొట్టగా ఉలుకూపలుకూలేదు. దీంతో చుట్టుపక్కల వారిని పిలిచి తలుపులు పగులకొట్టి చూడగా ప్రశాంత్‌ విగతజీవిగా పడి ఉన్నాడు. అటు కోదాడలో కూడా శాలిని తెల్లవారుజామునే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఇద్దరు వేర్వేరు ప్రదేశాల్లో ఉన్నా చివరి క్షణంలో వీడియోకాల్‌ ద్వారా మాట్లాడుకొని ఒకే సమయంలో పురుగుల మందు తాగారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement