ప్రేమించడం పాపమా.. శాపమా?

Lovers Suicide Attempt Mahabubnagar Crime News - Sakshi

ప్రేమించడం పాపమా.. శాపమా? అనే ప్రశ్నకు సమాధానం లభించడంలేదు. కొందరు తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకుంటుండగా మరికొందరు ఆ ధైర్యం చేయలేక తనువు చాలిస్తున్నారు.. అందరికీ తెలిసిపోయిందని కొందరు.. తల్లిదండ్రులు ఒప్పుకోరనే భయంతో మరికొందరు.. వారిని ఎదురించలేక ఇంకొందరు.. ఇలా వేర్వేరు కారణాలతో ప్రేమికుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ఆరునెలల కాలంలో పోలీసుల రికార్డులు పరిశీలిస్తే ఆత్మహత్యలు చేసుకున్నవారి సంఖ్య 20 నుంచి 25 మందికి పైగా ఉండగా జంట ఆత్మహత్యలే 10 వరకు ఉన్నాయి. తాజాగా మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో ప్రేమికుల జంట ఆత్మహత్యలు కలకలం రేపాయి. ప్రేమించడం పాపం కాదు.. కానీ ఆత్మహత్య చేసుకుని తల్లిదండ్రులకు షాపంగా మార్చడమే సరైంది కాదు. అయితే వీరందరూ ఒక్కక్షణం ఆలోచించినా.. ఆత్మస్థైర్యం నింపుకున్నా ఆత్మహత్య చేసుకోవాలనే తలంపుతో బయటపడేవారని సూచిస్తున్నారు మానసిక వైద్య నిపుణులు. 

మహబూబ్‌నగర్‌ రూరల్‌: దేశానికి పట్టుగొమ్మలు అయిన అన్నదాతలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెన్నుదన్నుగా నిలిచాయి. ప్రతి ఏడాది రైతుబంధు, పీఎం కిసాన్‌ సమ్మాన్‌ పథకం కింద పలు విడతల్లో రైతులకు ఎకరాకు రూ.16 వేల పెట్టుబడి సాయం వస్తుండడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రెండో విడతగా పెట్టుబడి సాయం అందిస్తుండగా.. కేంద్రం తొలి విడతగా ఎన్నికలకు ముందు రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేసింది. ఈ లెక్కన మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో ఏడాదికి రూ.755.33 కోట్ల సాయం అందినట్లయింది. వర్షాకాలంలో వ్యవసాయ పనులు ప్రారంభం నుంచి మొదలుకొని సాగు చేసే వరకు అయ్యే ఖర్చును కొంత వరకు ప్రభుత్వమే భరిస్తున్నందున రైతులు వ్యవసాయంపై మక్కువ చూపుతున్నారు. నీటి వనరులు, బోరు బావులు, చెరువుల కింద పంటలు సాగు చేసే రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుండా 
 

ప్రేమే లోకం కాదు 
ప్రేమించిన వ్యక్తి నిరాకరించారని, ప్రేమించి మోసం చేశారని యువత ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. జీవితంలో ప్రేమ ఒక్కటే లేదు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, తోబుట్టువులు, బంధువులు ఇలా అందరినీ దుఃఖసాగరంలో ముంచి ఆత్మహత్యకు పాల్పడి సాధించేదేముంది. విలువైన జీవితంలో సాధించాల్సిన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించడానికి కృషిచేయాలి. కన్నవారి కలలను తీర్చాలి. పుట్టి.. పెరిగిన ఊరికి పేరు, ప్రఖ్యాతులు తీసుకురావాలి.
 
ధైర్యం చెప్పేవారేరీ..? 
‘సమాజంలో మనిషి ఎదుర్కోలేని కష్టాలను భగవంతుడు ఎన్నటికీ ఇవ్వడు’ అంటారు పరమహంస యోగానంద. రామాయణంలోని సుందరకాండలో ఆంజనేయుడు ఒక మాట అంటాడు. చనిపోవడం అనేక దోషాలకు కారణమవుతుంది. బతికుంటే ఏనాటికైనా శుభం కలుగుతుంది. అని ఇలాంటి స్ఫూర్తిదాయక మాటలు చెప్పేవారు రోజురోజుకూ తగ్గిపోతున్నారు. బలమే (ధైర్యమే) జీవితం.. బలహీనతే మరణమని అందరూ నమ్మాలని స్వామి వివేకానంద ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగయ్యేకొద్దీ ధైర్యవచనాలు చెప్పే వారు కరువవుతున్నారు.

  • క్షణికావేశానికి లోనై బలవన్మరణం చేసుకుంటున్న వారిలో అత్యధికులు భారతీయులే ఉంటున్నట్లు ఒక అంతర్జాతీయ సంస్థ సర్వే వెల్లడించింది. వీరిలో అత్యధికులు ప్రేమలో విఫలం చెంది ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు గుర్తించారు. ఏటా వెయ్యి మందిలో 150 మంది    ఇంట్లో  ప్రేమ పెళ్లిళ్లకు పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారనేది దీని సారాంశం. ఈ లెక్కన ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇలాంటి ఘటనలు అధిక శాతం పెరుగుతున్నాయి. ఇలాంటి కేసులు జిల్లాలో ఇటీవల వరుసగా చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. 
  • ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో ప్రతి 40 సెకన్లకు ఒకరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. సంవత్సరానికి సుమారు పది లక్షల మంది ఆత్మహత్య చేసుకొని మృతి చెందుతున్నారు. మనిషి తనకు తానుగా ఆత్మహత్య చేసుకోవాలని అనుకోవడం, మానవ అపసామాన్య స్థితిని తెలియజేస్తుంది. వ్యక్తి వారి జీవితాన్ని అంతం చేసుకోవాలని విపరీతమైన ఆలోచనలు చేయడాన్ని వైద్య భాషలో పారాసూసైడ్‌ అంటారు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన, ఆత్మహత్యా ప్రయత్నం రెండూ తీవ్రమైనవిగా పరిగణించాల్సిన అవసరం ఉంది. మనుషులు వారికి అనుకున్నది సాధించలేకపోయినప్పుడు.. నిస్సహాయులై మిగిలిపోయినప్పుడు.. భవిష్యత్‌ను అంధకారంగా భావించినప్పుడు తట్టుకోలేని మానసిక ఒత్తిడికి గురైనప్పుడు.. జీవితంలో మనోవ్యాధికిలోనై ఆత్మహత్యకు పాల్పడుతున్నారని నిపుణుల మాట.

ఇవిగో ఘటనలు.. 
తమ ప్రేమకు తల్లిదండ్రులు ఒప్పుకోరనే అనుమానంతో ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడుకు చెందిన లోకేష్‌నాయుడు, కస్తూరిలు సోమవారం అర్ధరాత్రి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అలాగే తెలకపల్లి మండలం దాసుపల్లికి చెందిన గణేశ్‌ అనే యువకుడు తాను ప్రేమించిన అమ్మాయికి మరో వ్యక్తితో పెళ్లి చేస్తున్నారని తెలుసుకొని పురుగు మందు తాగి మృతిచెందాడు. ఇలాంటి ఘటనలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇటీవల తరచూ చోటుచేసుకుంటుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ ఘటనలన్నీ కేవలం క్షణికావేశంలో చోటుచేసుకున్నవేనని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు.  

మూడు కారణాలు

ఆత్మహత్య చేసుకోవడం వెనక ప్రధానంగా మూడు కారణాలున్నాయి. పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడం, ప్రేమ విఫలం కావడం, తీవ్రమైన నిరసన తెలపడం.. అభద్రతాభావం.. తన బాధ వినే వారు ఎవరూ లేరనే భావనతో ఆత్మహత్య చేసుకోవడానికి పురిగొల్పుతుంది. ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో ఎక్కువగా నడివయస్కులవారే. తన మాట వినే వారు ఉన్నారు అని వారు భావించినప్పుడు వారిలో ఆత్మహత్య 
ఆలోచన రాకుండా
ఉంటుంది.

గెలిచి.. చూపించాలి

ప్రతీ వ్యక్తి జీవితంలో గెలవాలంటే అన్నింటికన్నా ముందు మానసిక పరిపక్వత చాలా అవసరం. చిన్ననాటి నుంచి వృద్ధాప్యం వరకు ఒడిదొడుకులు, కష్టాలు, ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. అన్నీ దాటుకుంటూ వచ్చి అకారణంగా చిన్న విషయంలో ఒంటరి వారమవుతున్నాం. ప్రతి విషయాన్ని ఓపికగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే గెలుపు మన పక్కనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఓటమి కూడా మనసును పలకరిస్తుంటుంది. జీవితమంటే గెలుపోటముల సంగ మం అని గ్రహిస్తే కుంగుబాటును దూరం చేసుకోవచ్చు. చిన్న చిన్న విషయాలకే బలవన్మరణానికి పాల్పడితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాల ని కోటి మొక్కులు మొక్కే మన తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు ఇలా మన వెనక గెలు పు చూడాలని తాపత్రయపడే వారు చాలామంది ఉంటారు. పిల్లల చదువులు, ఉద్యోగాల కోసం జీవితాన్ని ధారబోసే తల్లిదండ్రులుంటారు. జీవితం ఒక్క మనకే పరిమితం కాదు. చాలా బంధాలు, బాంధవ్యాలతో ముడిపడి ఉంటుందనే విషయాన్ని గుర్తెరిగి నిర్ణయాలు తీసుకోవాలి. మనపై ఆధారపడినవారి గురించి ఆలోచించాలి. మనం ఎదగడంలో, ఉద్యోగం సాధించడంలో వారి పాత్ర ఉందని, మన ఎదుగుదలకు వారు ఉపయోగపడాలనే ఆలోచన మదిలో మెదలాలి. 

మార్పు గమనించాలి.. 
ఆత్మహత్య చేసుకోవాలని అనుకునే వారు అప్పటికప్పుడు కాకుండా ఇలాంటి వారు ముందుగానే బలవన్మారణాలకు సిద్ధమవుతారు. కుటుంబ సభ్యులతో ముభావంగా ఉంటారు. ఏదో పరలోకంలో ఉన్నట్లు ఆలోచన చేస్తారు. చిన్న చిన్న విషయాలకు ఏడుస్తుంటారు. నేను లేకపోయిన మీరు బాగుండాలనే మాటలు నోటి నుంచి వస్తుంటాయి. తోటి విద్యార్థులతో సన్నిహితంగా మెలగరు. ఒకరిద్దరితో జీవితం అంతమైతే తర్వాత ఏం జరుగుతుందనే చర్చలు జరుపుతారు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కలిగినప్పుడే చనిపోవచ్చు. – డాక్టర్‌ రామకిషన్, జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్, మహబూబ్‌నగర్‌ 

ఆ.. ఆలోచననే తుంచేయాలి 
అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే మన దేశంలో మానసిక జబ్బులపై ప్రజలకు సరైన అవగాహన లేదు. తీవ్ర ఒత్తిడిలో ఉన్నవారి మానసిక పరిస్థితిని అర్థం చేసుకునే శక్తి కూడా తక్కువే. ఆ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన ప్రతి ఒక్కరికీ వచ్చే ఆలోచన ఆత్మహత్య చేసుకోవడం.. ఇలాంటి ఆలోచనను మొగ్గలోనే తుంచేయాలి. ప్రేమలో విఫలం చెందిన వారి మీద వాస్తవానికి ఒత్తిడి బాగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం ఆత్మహత్యలకు దారితీస్తోంది. ప్రస్తుతం ఏమీ చేయలేనన్న భావనను మనసులోంచి తీసేయాలి. – వంగీపురం శ్రీనాథాచారి,  మానసిక వ్యక్తిత్వ వికాస నిపుణుడు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top