మాజీ ప్రేయసికి బుద్ది చెప్పాలని..

Lover Held For Writing Islamic State Message On Mall Posters - Sakshi

ముంబై : నిన్నటి దాకా తనతో చనువుగా ఉన్న గర్ల్‌ఫ్రెండ్‌ తనకు దూరమైందన్న కసితో ఆమెకు బుద్ధి చెప్పాలని తనే ఇరకాటంలో పడిన ప్రబుద్ధుడి నిర్వాకం ముంబైలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే..ఉగ్ర సంస్ధ ఐఎస్‌ గురించి నగరంలోని ఓ షాపింగ్‌ మాల్‌లోని పోస్టర్‌పై రాసిన విఖ్రోలికి చెందిన కేత్‌ గోడ్కేను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడు గోడ్కే ఐఎస్‌ సందేశంతో పాటు ఓ మహిళ, మరో వ్యక్తి ఫోన్‌ నెంబర్లను కూడా అందులో ప్రస్తావించాడు. ఐసిస్‌ స్లీపర్‌ సెల్‌ చురుకుగా పనిచేస్తోందంటూ ఆ పోస్టర్‌పై నిందితుడు రాశాడని డీసీపీ అవినాష్‌ అంబురే వెల్లడించారు. ముంబైలోని ప్రముఖ సిద్దివినాయక ఆలయం గురించి కూడా పోస్టర్‌లో ప్రస్తావించాడని చెప్పారు.

కాగా పోస్టర్‌లో పేర్కొన్న మహిళ పోన్‌ నెంబర్‌ను విచారించగా, నిందితుడితో ఆమెకు ఏడేళ్ల పాటు సన్నిహిత సంబంధం ఉందని, ఆమెను వేధించేందుకే ఆమె నెంబర్‌ను పోస్టర్‌లో రాసినట్టు వెల్లడైందని తెలిపారు. ఆమెకు గుణపాఠం చెప్పేందుకే మహిళతో పాటు ఆమె బాయ్‌ఫ్రెండ్‌ ఫోన్‌ నెంబర్‌ రాశానని నిందితుడు వెల్లడించాడని చెప్పారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి తదుపరి దర్యాప్తును ముమ్మరం చేశామని డీసీపీ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top