అప్పుడే పెళ్లి చేసుకున్న ప్రేమ జంటపై దాడి

Love Married Couple Attacked By Girl Relatives In Annavaram - Sakshi

సాక్షి, కృష్ణా : అప్పుడే పెళ్లి చేసుకొని ఇంటికి తిరిగి ఇంటికి వస్తున్న ప్రేమ జంటపై యువతి బంధువుల దాడి చేసి నవవధువును లాక్కెళ్లిన ఘటన కృష్ణా జిల్లా అవనిగడ్డలో చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా రేపల్లె మండలం అరవపల్లికి చెందిన వేపూరి గోపి(23), అదే గ్రామానికి చెందిన భూపతి పూజిత(20) గత కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు.

పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో అన్నవరం గుడిలో వివాహం చేసుకున్నారు. వివాహనంతరం తిరిగి సొంత గ్రామానికి వస్తుండగా పులిగడ్డ టోల్‌గేట్‌ వద్ద నవ దంపతులపై యువతి బంధువలు దాడి చేశారు. గోపిని తీవ్రంగా గాయపరచి పూజితను కిడ్నాప్‌ చేశారు. ఈ దాడిపై నవవరుడు గోపి అవనిగడ్డ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top