ప్రేమ వేధింపులు..వ్యక్తికి జైలు శిక్ష | Love harassment .. jail sentence | Sakshi
Sakshi News home page

ప్రేమ వేధింపులు..వ్యక్తికి జైలు శిక్ష

Mar 1 2018 12:25 PM | Updated on Oct 16 2018 3:15 PM

Love harassment .. jail sentence  - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

మునిపల్లి(అందోల్‌): ప్రేమించమని వెంటపడిన వ్యక్తికి మేజిస్ట్రేట్‌ మహేష్‌నాథ్‌ ఆరు నెలల జైలు శిక్షతోపాటు రూ. 12 వేల జరిమానా విధించినట్లు బుదేరా ఎస్‌ఐ కోటేశ్వర్‌రావు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ మండలంలోని లింగంపల్లి గ్రామానికి చెందిన యువతిని మేళసంగ్యం గ్రామానికి చెందిన ఎల్లయ్య ప్రేమించమని, పెళ్లి చేసుకోవాలని వేధించసాగాడు.

విసుగు చెందిన యువతి 2016 సెప్టెంబర్‌లో బుదేరా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పట్లో ఎల్లయ్యపై ఎస్‌ఐ కోటేశ్వర్‌రావు కేసు నమోదు చేశారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సుధాకర్‌ వాదనలు విన్న మేజిస్ట్రేట్‌ మహేశ్‌నాథ్‌ బుధవారం ఎల్లయ్యకు ఆరు నెలల జైలుతోపాటు రూ. 12 వేల జరిమానా విధించినట్లు ఎస్‌ఐ తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement