ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమజంట మృతి | Love Couples Commits Suicide In Adilabad | Sakshi
Sakshi News home page

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రేమజంట మృతి

Nov 22 2019 9:44 AM | Updated on Nov 22 2019 10:51 AM

Love Couples Commits Suicide In Adilabad - Sakshi

మృతిచెందిన గౌరు, జీవన్ (ఫైల్‌)  

సాక్షి, తాండూర్‌(బెల్లంపల్లి): ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రేమజంట ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి గురువారం మృతి చెందారు. వివరాలలోకి వెళితే.. బెజ్జూరు మండలం లంబాడితండా పరిధిలోని బొగుడ గూడ గ్రామానికి చెందిన గోమాస జీవన్‌ (35), తాండూర్‌ మండలం కాసిపేట గ్రామానికి చెందిన  ఏల్పుల గౌరు(29) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. సామాజిక వర్గాలు వేరు కావడంతో ఇరు కుటుంబాలు అంగీకరించకపోవచ్చని  బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్నేహితులు మంచిర్యాల ఆస్పత్రిలో చేర్పించగా మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు తరలిం చారు. వేర్వేరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి గురువారం మృతి చెందిన సీఐ సామల ఉపేందర్‌ తెలిపారు.   

Advertisement
 
Advertisement
Advertisement