ఆటోను ఢీకొన్న లారీ: నలుగురు దుర్మరణం

lorry-auto collisioned: 4 passengers died - Sakshi

సాక్షి, టేకులపల్లి: భద్రాద్రికొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బేతంపూడి(తంగెళ్ల తండా వద్ద) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో నలుగురు ప్రయాణికులు మృతిచెందారు. ప్రయాణికులతో వెళ్తున్నఆటో ఆగి ఉండగా భారీ లారీ ఢీకొని దాని మీద నుంచి వెళ్లడంతో అది నుజ్జునుజ్జు అయింది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని కొత్తగూడెం ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. వీరిలో మరొకరు మృతిచెందారు. ప్రమాద సమయంలో ఆటోలో ఆరుగురు ప్రయాణిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సంఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ సందర్శించారు.

Back to Top