విషాదంగా మారిన దీప్తీశ్రీ కిడ్నాప్‌ కేసు | Kidnaped Deepthi Sri Murdered By Step Mother | Sakshi
Sakshi News home page

విషాదంగా మారిన చిన్నారి దీప్తీశ్రీ కేసు

Nov 25 2019 2:53 PM | Updated on Nov 25 2019 4:28 PM

Kidnaped Deepthi Sri Murdered By Step Mother - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : మూడు రోజుల క్రితం తప్పిపోయిన చిన్నారి దీప్తీశ్రీ (7) కేసు చివరికి విషాదంగా మారింది. కాకినాడలో శుక్రవారం పాఠశాలకు వెళ్లిన దీప్తీ కిడ్నాప్‌కు గరైన విషయం తెలిసిందే. పాప సవతి తల్లి శాంతి కుమారినే ఈ దారుణానికి పాల్పడినట్లు చిన్నారి నాయనమ్మ ఆరోపించడంతో పోలీసులు శాంతి కుమారిని అదుపులోకి తీసుకొని విచారించారు. దీప్తిని గొంతు నులిమి హత్య చేసినట్లు, ఉప్పుటేరు కాల‍్వలో పడేశానని పలు రకాల సమాధానాలు చెప్పడంతో కాకినాడ సబ్‌ డివిజన్‌ పోలీసులు చిన్నారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చర్యలు ముమ్మరం చేసిన పోలీసులకు ఇంద్రపాలెం లాకుల వద్ద గుర్రపు డెక్కల కింద చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. శుక్రవారం సాయంత్రం పాఠశాల నుంచి దీప్తీని సవతి తల్లి శాంతికుమారి అపహరించి హత్య చేసిందని, అనంతరం ఆమె మృతదేహాన్ని మూటలో కట్టి ఇక్కడ పడేసినట్లు పోలీసులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement