'లక్ష ఇస్తే నా పరువొస్తుందా..'

jerripothulapalem : chandrababu orders enquiry - Sakshi

సాక్షి, విశాఖపట్నం : దళిత మహిళపై జెర్రిపోతులపాలెంలో దాడి ఘటన విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కార్‌ ఎట్టకేలకు స్పందించింది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాటంతో దిగొచ్చింది. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరపాలని జిల్లా కలెక్టర్‌కు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. దళితుల భూమిని కాజేసేందుకు అధికార టీడీపీ నాయకులు ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఆ క్రమంలో వారు దాదాపు దుశ్చాసనపర్వానికి దిగారు. ఓ దళిత మహిళను వివస్త్రను చేసి దాడి చేశారు. ఈ ఘటనలో టీడీపీ ప్రజాప్రతినిధులతోపాటు నాయకులు కూడా నిందితులుగా పట్టుబడ్డారు.

ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ వర్గీయులు ఈ చర్యకు పాల్పడ్డారు. దీనిపై సర్వాత్రా ఆగ్రహ జ్వాలలు ఎగిసి పడ్డాయి. సభ్యసమాజం ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. దీనిపై తొలుత ప్రభుత్వం స్పందించకపోవడం ఆప్రాంత ఎమ్మేల్యేగానీ, ఎంపీగానీ అటుపక్క వచ్చి కనీసం పరామర్శ కూడా చేయని తీరును వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, ఇతర ప్రజా సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. తీవ్ర స్థాయిలో ఆందోళనకు దిగారు. దీంతో ప్రభుత్వం కంటితుడుపు చర్యగా బాధిత మహిళల్లో ఒకరికి రూ. లక్ష, మరొకరికి రూ.25 వేల నష్టపరిహారం ప్రకటించింది. కాగా, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేశారు.

రూ.లక్ష ఇస్తే పరువు వస్తుందా : బాధితురాలు
తనకు జరిగిన అన్యాయానికి రూ.లక్ష ఇస్తే న్యాయం జరుగుతుందా అని జెర్రిపోతులపాలెంలో దాడికి గురైన దళిత మహిళ అన్నారు. అందరూ చూస్తుండగా తనను వివస్త్రను చేశారని, దుర్మార్గంగా చేశారని, అందరిలో పోయిన పరువు వీరు డబ్బులిస్తే వస్తుందా అని ఆవేదన చెందారు. దోషులను శిక్షిస్తేనే తనకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top