అంతర్రాష్ట్ర చెడ్డీ గ్యాంగ్ అరెస్ట్
Aug 01, 2018, 11:37 IST

రంగారెడ్డి : తెలుగు రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతోన్న అంతర్రాష్ట్ర చెడ్డీ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో చెడ్డీగ్యాంగ్ దోపిడీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. గుజరాత్‌లోని దావోడ్‌లో ముగ్గురు చెడ్డీ గ్యాంగ్ సభ్యులను రాచకొండ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 10 తులాల బంగారం, కిలో వెండి వస్తువులు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని హైదరాబాద్‌కు తీసుకువచ్చారు.
Advertisement
Advertisement
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి