అంతర్జాతీయ ఫోన్‌ కాల్స్‌ ముఠా అరెస్టు

International Phone Calls Fraud Gang Arrested In Kadapa - Sakshi

రూ.లక్షల్లో విలువజేసే కంప్యూటర్, పరికరాలు స్వాధీనం 

డీఎస్పీ నారాయణస్వామి రెడ్డి 

సాక్షి, రాజంపేట: చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ ఫోన్‌కాల్స్‌ ముఠాను అరెస్టు చేసినట్లు రాజంపేట డీఎస్పీ వీ నారాయణస్వామి రెడ్డి తెలిపారు. స్థానిక అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌లో సీఐ బి. శుభకుమార్‌తో కలిసి శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ ఫోన్‌కాల్‌ నిర్వహిస్తున్న ముఠాలోని ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వారి వద్దనున్న రూ. లక్షల్లో విలువజేసే వాయిస్‌ ఓవర్‌ ఇంటర్‌నెట్‌ ఫ్రొటోకాల్‌ టెలికమ్యూనికేషన్‌ సామగ్రి, కంప్యూటర్‌లను,  అలాగే దాదాపు 500కుపైగా సిమ్‌ కార్డులను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలియజేశారు. పట్టణ బీఎస్‌ఎన్‌ఎల్‌ జేఈ ప్రసాద్‌ ఫిర్యాదు మేరకు అంతర్జాతీయ ఫోన్‌ కాల్స్‌ ముఠాపై దృష్టి సారించామని ఆయన పేర్కొన్నారు.


స్వాధీనం చేసుకున్న కంప్యూటర్‌ తదితర పరికరాలు

రెడ్డివారి వీధిలో నిర్వహించే ఈ ముఠా నెలకు రూ. 10లక్షలు మేరా ఆదాయం ఆర్జీస్తున్నట్లు తెలిపారు. పట్టణానికి చెందిన సయ్యద్‌ మహ్మద్‌ షరీఫ్‌ అలియాస్‌ మున్నా, పోలికి చెందిన గుండ్రాజు సుదర్శన్‌ రాజు, రాజశేఖర్‌ నాయుడు అలియాస్‌ నాయుడులను అదుపులోకి తీకున్నామన్నారు. ప్రధాన సూత్రధారి రెడ్డివారి వీధికి చెందిన లక్ష్మీనారాయణ కువైట్‌లో ఉన్నాడన్నారు. వీరి వద్ద నుంచి అతడు లింక్‌ తీసుకొని అక్కడ నుంచి కువైట్, ఇండియా, చైనా, అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా వంటి దేశాలకు నిమిషానికి రూ.32 అయ్యే కాల్‌ని రూ. 6 లకే అందిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు.  అక్రమమార్గంలో టెక్నాలజీని ఉపయోగించి ఫోన్‌ కాల్స్‌ చేయడం నేరమన్నారు.  కార్యక్రమంలో పట్టణ పోలీసులు పాల్గొన్నారు.   
చదవండి : స్మార్ట్‌ దోపిడీ

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top