గర్భిణిని కత్తెరతో పొడిచిన భర్త | Husbang Attacked On Pregnent Wife With Scissors | Sakshi
Sakshi News home page

గర్భిణిని కత్తెరతో పొడిచిన భర్త

Apr 10 2018 11:28 AM | Updated on Apr 10 2018 11:28 AM

Husbang Attacked On Pregnent Wife With Scissors - Sakshi

చికిత్స పొందుతున్న సునిత

బజార్‌హత్నూర్‌(బోథ్‌): బజార్‌హత్నూర్‌ మండల కేంద్రంలోని యాదవ సంఘం భవన సమీపంలో నివాసం ఉంటున్న భార్యభర్తలు కుట్టల్‌వార్‌ దుర్గజీ, సునిత మధ్య గొడవ కత్తెరపోటుకు దారి తీసింది. మండలంలోని మాన్కపూర్‌ గ్రామానికి చెందిన కుట్టల్‌వార్‌ దుర్గజీ మండల కేంద్రంలో కుటుంబంతో పాటు నివాసం ఉంటూ పాలేరుగా పనిచేస్తున్నాడు. గత రెండు రోజులుగా భార్యభర్తలు గొడవ పడుతున్నారు. సోమవారం ఉదయం 10 గంటల సమయంలో నాలుగు నెలల గర్భవతి సునితతో గొడవకు దిగి అక్కడే ఉన్న బీడీల కత్తేరతో ఆమె పొత్తికడుపులో పొడిచాడు.

సునిత చనిపోతుందని భావించిన దుర్గజీ ఇంటి ముందు ఉన్న విద్యుత్‌ స్తంభం ఎక్కి కరెంట్‌ వైర్లను పట్టుకుని వేలాడాడు. కానీ ఆ సమయంలో విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో, కింద పడడంతో స్థానికులు వెంటనే భార్యభర్తలిద్దరినీ పీహెచ్‌సీకి, అటునుంచి ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం ఇద్దరూ చికిత్స పొందుతున్నారు. సునిత తల్లి జాడేవార్‌ రుక్మాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై ఎస్‌ అబ్దుల్‌ మోబిన్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement