భర్త వేధింపులతో గర్భిణి మృతి | Husband's Harassment Pregnant Died | Sakshi
Sakshi News home page

భర్త వేధింపులతో గర్భిణి మృతి

Apr 7 2018 12:17 PM | Updated on Apr 7 2018 12:17 PM

మంచిర్యాలక్రైం: భర్త వేధింపులతో అనారోగ్యానికి గురై గర్భిణి మృతి చెందింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌కు చెందిన నిమ్మకంటి శ్రీలత (22) బెల్లంపల్లికి చెందిన ఎండీ అజ్గర్‌తో ఏడు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో శ్రీలత కుటుంబ సభ్యులు కొంత కాలంగా ఇంటికి రానియ్యలేదు.

తరుచూ వేధింపులకు గురి చేస్తూ రోజు చిత్రహింసలకు గురి చేస్తున్న క్రమంలో వారం రోజుల క్రితం పుట్టింటికి వచ్చింది. అప్పటికే  శ్రీలత నాలుగు నెలల గర్భిణి. దీంతో అనారోగ్యానికి గురై సరైన వైద్యం అందక మృతి చెందింది. ఆమె మృతికి భర్త అజ్గర్‌ కారణమని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్సై వెంకటేశ్వర్‌ తెలిపారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement