మద్రాసు హైకోర్టులో దారుణం.. జడ్జి కళ్ల ముందే..

Husband Knife Attack On Wife In Madras High Court Hall - Sakshi

సాక్షి, చెన్నై : మద్రాసు హైకోర్టులో దారుణం చోటు చేసుకుంది. జడ్జీ కళ్లముందే భార్యను కత్తితో పొడిచాడు ఓ దుర్మార్గపు భర్త. చెన్నైకి చెందిన శరవణన్‌ తన భార్య వరలక్ష్మీలు ఓ కేసు విచారణకై ఫ్యామిలీ కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసును జడ్జి కళైవానన్‌ విచారిస్తుండగా వరలక్ష్మీపై శరవణన్‌ కత్తి దాడికి దిగాడు. కోర్టు హాలులో ఉన్న వరలక్ష్మీ దగ్గరకు ఆవేశంగా పరుగెత్తుకొచ్చి కత్తితో పొడిచాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది శరవణన్‌ను అడ్డుకున్నారు. గాయాల పాలైన వరలక్ష్మీని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top