భార్యపై కత్తితో దాడి | Husband Knife Attack on Wife in Chittoor | Sakshi
Sakshi News home page

భార్యపై కత్తితో దాడి

Jan 31 2019 11:46 AM | Updated on Jan 31 2019 11:46 AM

Husband Knife Attack on Wife in Chittoor - Sakshi

చికిత్స పొందుతున్న శోభ

చిత్తూరు , గుడిపాల: తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుని పరువు తీస్తోందని, పోలీసులు తీరు మార్చుకోవాలని హిత వు పలికినా మారలేదని ఆగ్రహించాడు. తానింట్లో ఉన్న స మయంలోనే దూరంగా ఉన్న మరో వ్యక్తికి సైగలు చేస్తుండటంపై  గమనించి కుతకుత ఉడికిపోయాడు. కత్తితో భార్యపై దాడి చేశాడు. గుడిపాల ఎస్‌ఐ విక్రమ్‌ కథనం..వసంతాపురం దళితవాడకు చెందిన సైమన్‌(40)అదే దళితవాడలోని శోభ(25)కు పదేళ్ల క్రితం వివామైంది. సైమన్‌ గ్రానైట్‌ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు.

కొన్ని రోజులుగా భార్య తీరు మరోలా ఉండడంతో అనుమానించాడు. గ్రామంలోని మరో వ్యక్తితో వివాహేతర సంబం ధం కొనసాగిస్తోందంటూ కొంతకాలంగా ఆమెతో గొడవ పడుతున్నాడు. పోలీస్‌స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఇద్దరికీ నచ్చజెప్పారు. బుద్ధిగా మసలుకోవాలని శోభకు హితవు పలికారు. ఈ నేపథ్యంలో బుధవారం దంపతులిద్దరూ చిత్తూరుకు వెళ్లి ఇంటికి వచ్చారు. సైమన్‌ బాత్‌రూంకి వెళ్లి వచ్చేసరికి శోభ అదే దళితవాడలోని మరో వ్యక్తికి దూరం నుంచి సైగలు చేస్తుండటం గమనించి నిలదీశాడు. శోభ నిర్లక్ష్యంగా బదులివ్వడంతో ఆగ్రహించిన సైమన్‌ ఆమెపై కత్తితో దాడి చేశాడు. తలపై తీవ్రగాయమైంది. చేయి విరిగిపోయింది. స్థానికులు ఆమెను చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. సైమన్‌ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. 

Advertisement
 
Advertisement
Advertisement